సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి తీర్పుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సుధీర్ బాబు ఖండించారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు, ఎన్ఎస్యువై జిల్లా అధ్యక్షుడు కరీంతో కలిసి పార్టీ కార్యాలయంలో సుధీర్ మాట్లాడారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా బెదిరించే ధోరణితో ముందుకు వెళ్తుందని మండిపడ్డారు.