బాపట్లలోని సూర్యలంక బీచ్ వద్ద ఆదివారం పెను ప్రమాదం తప్పింది. సముద్ర స్నానానికి వచ్చిన యువకుడు సముద్రంలో అలల ఉధృతికి కొట్టుకుపోతూ ఉండగా అప్రమత్తమైన మైనర్ పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో అతడిని ఒడ్డుకు చేర్చారు. అతడికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. పర్యాటకులు ఎవరు సముద్రం లోపలికి వెళ్ళవద్దని పోలీసులు హెచ్చరించారు.