జడ్చర్ల పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఎంబీ చర్చ్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న ప్రమోద్ అక్కడికక్కడే మరణించాడు. మరో యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.