బాపట్లలో దివ్యాంగుల పెన్షన్ తొలగించారనే నెపంతో టవర్ ఎక్కిన ఘటనపై పలువురిపై కేసులు నమోదు చేసినట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు చెప్పారు. గురువారం బాపట్ల PSలో ఆయన మీడియాతో మాట్లాడారు. డ్యూటీలో ఉన్న అధికారులను అడ్డుకున్నందుకు గాను వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చల్లా రామయ్య గతంలో కూడా ఇలా బెదిరింపులకు పాల్పడ్డాడని భవిష్యత్తులో ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు..