నల్గొండ జిల్లా, గుర్రంపొడు మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులను పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్ గురువారం సాయంత్రం ఆకాశంకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెట్రోల్ బంకు నిర్వాహకులు వినియోగదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, అమర్యాదగా మాట్లాడితే ఫిర్యాదులకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. ప్రతి పెట్రోల్ బంక్ లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని ఆయన సూచించారు. పెట్రోల్ బంకుల నిర్వహణలో అశ్రద్ధ, అలసత్వం, నిర్లక్ష్యం ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.