విద్యాంజలి పోర్టల్ లో పాఠశాలకు అవసరమైన సేవలు అప్లోడ్ చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పనుల పురోగతి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాంజలి పోర్టల్ లో జిల్లాలోని అన్ని పాఠశాలలకు సంబంధించిన ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రధానోపాధ్యాయుల ద్వారా అప్లోడ్ చేయాలన్నారు.