పామూరు: రానున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీల నిర్వాహకులు తప్పనిసరిగా గణేష్ మండపాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమా నాయక్ అన్నారు. సోమవారం పామూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా రెండు నుంచి మూడు సీసీ కెమెరాలను మండపాల వద్ద ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాలకు ఏర్పాటు చేసే లైటింగ్ వల్ల ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూసుకోవాలన్నారు. గణేష్ మండపాల అనుమతుల కొరకు గణేష్ యాప్ లో తమ దరఖాస్తులు నమోదు చేసుకోవాలని సూచించారు.