తెలంగాణలో పలువురు బీసీ నాయకులు చేరారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. 2001 నుంచి కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ గోపు సదానందం, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్, అరె కటిక సంఘం సురేందర్ తమ అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు.