అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమీద పల్లి గ్రామంలో ఆదివారం నాలుగు గంటల సమయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత ఎంపీ పార్థసారథి పరిటాల శ్రీరామ్ తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పరిటాల సునీత మాట్లాడుతూ అంబేద్కర్ దళితుల కోసం ఏ విధంగా పోరాటం చేశారు అదే విధంగా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల రవీంద్ర, పరిటాల శ్రీరాములు దళితుల కోసం పోరాటాలు చేయడం జరిగిందని నేడు కూడా మా ఇంటికి వచ్చే దళితులతో కలిసి అందరూ భోజనం కూడా చేస్తామని దళితులకు తామెప్పుడూ అండగా ఉంటామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.