మహబూబాబాద్ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ ను BRS పట్టణ అధ్యక్షుడు గద్దె రవి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మంగళవారం మధ్యాహ్నం 12:00 లకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు.. పట్టణంలో పారిశుద్ధ్య మరియు మంచినీటి సరఫరా, వీధిలైట్లు, కుక్కల బెడద సమస్యను పరిష్కరించాలని కోరారు.అభివృద్ధి పనులను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు.. వార్డులలో డ్రైనేజీ సమస్య ఉండడం తో ప్రజలు అనారోగ్యల భారిన పడుతున్నారని తెలిపారు.సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.