ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఎమ్మెల్సీ కవిత కొత్త నాటకానికి తెరలేపారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏ.పి.మిథున్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రమేయం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల కుంభకోణం జరిగిందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.