జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ రమణ తోపాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్,ఆ పార్టీ జిల్లా అధ్యక్ధుడు విద్యాసాగర్ రావు హాజరైయ్యారు. వివిధ పార్టీలకు చెందినా కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరగా వారికీ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.