షాద్నగర్లో మోస్తరు వర్షం కురుస్తోంది. సాధారణంగా ఉన్న వాతావరణంలో మార్పు చోటు చేసుకుని మేఘావృతమై మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షం కురుస్తున్నప్పటికీ బతుకమ్మ సంబరాల్లో మహిళలు పాల్గొని ఉత్సాహంగా ఆడి పాడారు. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.