అనకాపల్లిలోని లక్ష్మీదేవి పేటలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. పహల్గం దాడి అనంతరం జరిగిన ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దేశాన్ని రక్షించిన సైన్యాధికారిగా స్వామి వారు ఉండగా, యుద్ధంలో సైనికుల వీరోచిత పోరాటాలు, త్యాగాలకు భారతమాత సెల్యూట్ చేస్తోన్న రీతిలో నిర్వాహకులు సెట్ వేశారు.