కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పర్చాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు పిలుపుమేరకు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నామాల శంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీ నాయకులంతా కలిసి పుట్టపర్తి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ టీఎస్.చేతన్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.