బోధన్ పట్టణంలోనీ మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ సందర్శించారు. పట్టణంలో శానిటేషన్ నిర్వహిస్తున్న తీరు, చెత్తా, చెదారం డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్న తీరును మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ అదనపు కలెక్టర్కు వివరించారు. పట్టణంలో చెత్త సేకరించేందుకు ఉపయోగిస్తున్న వాహనాలను అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉన్నారు