మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎ.పి. మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ జిల్లా స్థాయి మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.