జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గుర్రపు డెక్క నుండి వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. భీమవరంలో కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో మూడు యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వర్మీ కంపోస్ట్ వలన సాగు పొలాలకు మేలు కలుగుతుందని, యూరియా వినియోగం తగ్గుతుందని తెలిపారు. ఇప్పటికే భీమవరం, పాలకోడేరు, ఆకువీడు మండలాల్లో యూనిట్లు ప్రారంభమయ్యాయని అన్నారు.