కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయ గూడెం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని వినియోగించుకుని మహిళలంతా ఆరోగ్య వంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. మహిళలందరూ విద్యావంతులుగా ఎదగాలని కోరారు. పిహెచ్సిలో సాధారణ ప్రసవాలు పెరుగుతుండడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా శిశు సంక్షేమ అధికారి శ్రీమతి రేపు ఉద్యోగ విరమణ చేస్తుండడంతో ఆమె సేవలను కొనియాడారు. కలెక్టర్