హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం హుస్సేన్ పురం లో ఎంపీపీ, వైయస్సార్సీపి జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమ రెడ్డి పై దాడికి నిరసిస్తూ హిందూపురం పట్టణంలోని సద్భావన సర్కిల్ లో హిందూపురం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త దీపిక వైసిపి నాయకులు కార్యకర్తలతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైయస్సార్ సిపి సమన్వయకర్త కురుబ దీపిక తో పాటు కార్యకర్తలను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా హిందూపురం నియోజకవర్గం సమన్వయకర్త కురుబదీపిక మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీసుల దగ్గరుండి హిందూపురంలో అమలు చేయిస్తున్నారని ఆరోపించారు.