నెక్కొండ లో యూరియా కోసం రైతుల జాగారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లోని నెక్కొండ గ్రామ రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతుల జాగారం. మంగళవారం ఉదయం 6 గంటలకు యూరియా ఇస్తారని తెలిసి యూరియా దొరుకుతుందో లేదోనని రాత్రి దుప్పట్లు పట్టుకొని రైతు వేదిక వద్ద చేరుకున్నారు. ఓ పక్క దోమలు కుడుతున్న, చలి పెడుతున్నప్పటికీ యూరియాను దక్కించుకోవాలి, పంటను కాపాడుకోవాలన్న ఆవేదనతో రైతు వేదిక వద్ద పెద్ద ఎత్తున రైతులు బారులు తీరారు.