నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండలం కొండాపూర్ గోప్య తాండ గ్రామపంచాయతీ పరిధిలోని గంటతాండకు చెందిన బట్టు శంకర్ మంగళవారం కొండాపూర్ చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళాడు. చెరువు పక్కన బట్టలు వదిలి చేపల వలలో చిక్కుకొని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై రామకృష్ణ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహం కోసం గాలించి, వెలికి తీశారు. పంచనామ నిమిత్తం మారుతికి తరలించారు.