జిన్నారం సర్వే నంబర్ 1,376లోని బాధిత రైతులకు న్యాయం చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం జిన్నారం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. 180 ఎకరాల ప్రభుత్వ భూమిని హెచ్ఎండీఏకు అప్పగించి, ఎకరాకు 600 గజాలు ఇస్తామని రైతులకు సర్టిఫికెట్లు జారీ చేశారు. అయితే 3 సంవత్సరాలు గడిచినా, గత ప్రభుత్వం గానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గానీ రైతులకు న్యాయం చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.