Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: చంద్రగ్రహణం కారణంగా శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం మూత. ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి.

Punganur, Chittoor | Sep 7, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం కోనేటి వద్ద వెలసి ఉండు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసి వేయనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆదివారం ఉదయం 10 గంటలకు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒక గంట 50 నిమిషాలకు ఆలయాన్ని మూసివేసి. సోమవారం ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధిచేసిన అనంతరం సోమవారం ఉదయం ఐదు గంటల 30 నిమిషాల నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. పౌర్ణమి సందర్భంగా జరగవలసిన గరుడసేవ రద్దు చేయడం జరిగిందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us