పత్తికొండలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు మంగళవారం చేశారు. ఈ దాడిలో సుమారు 50 మందిని అరెస్టు చేసినట్లు పత్తికొండ సీఐ జయన్న తెలిపారు. 40 సెల్ ఫోన్లు 1,40,000 నగదు ఐదు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పత్తికొండలో ఎవరైనా ఆ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.