ఈఓఐ పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని బిజెపి టిడిపి జనసేన ప్రభుత్వాలు ఆపాలని, సొంత గనులు కేటాయించాలని, చట్ట విరుద్ధంగా తొలగించిన ఐదువేల మంది కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ,వీరి స్థానంలో ఇతర రాష్ట్రాల కార్మికుల నియామకం ఆపాలని ,ప్లాంట్ లోని 6 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, నిర్వాసితులకు పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని, కార్మిక పోరాటాలు ,దీక్షలపై కూటమి ప్రభుత్వ పోలీస్ నిర్బంధం నిలిపివేయాలని , ఉద్యోగులకు, కార్మికులకు పూర్తి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఈనెల 11న సాయంత్రం 5 గంటలకు పాతగాజువాకలో బహిరంగ సభ నిర్వహిస్తుంధన్నారు