తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో మరో ముందడుగు వేసిందని త్వరలోనే క్యాన్సర్ వ్యాధి చికిత్సను ప్రజలకు చేరువ చేయడానికి కృషి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం సంగారెడ్డి వైద్య ఆరోగ్య కళాశాల నుండి వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్యాన్సర్ డే కేర్ సెంటర్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో అన్ని జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీన్ టెస్ట్ వాహనాలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్లు పాల్గొన్నారు.