రైతులకు సరిపడా యూరియా అందించకపోవడంతో రైతులు షాద్ నగర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి క్యూ లైన్ లో వేచి ఉన్నప్పటికీ సరిపడా యూరియా అందించడం లేదని, గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. వెంటనే అధికారులు, ప్రభుత్వం స్పందించి యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.