చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణంలో అక్రమంగా నిలువ ఉంచిన టపాకాయ గోదాములపై స్పెషల్ బ్రాంచ్ సి.ఐ సూర్యనారాయణ, ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించి అక్రమంగా నిలువ ఉంచిన లక్షలాది రూపాయల టపాకాయలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలోనూ స్పెషల్ బ్రాంచ్ అధికారులు టపాకాయ అక్రమ నిలువలపై సోదాలు చేసి స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో ఎస్సై హరిప్రసాద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.