వివిధ రకాల సమస్యలతో సతమతమయ్యే బాధిత మహిళలకు అధికార యంత్రాంగం అండగా నిలవాలని, తగిన విధంగా తోడ్పాటు అందించాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డా. అర్చనా మజుందార్ పేర్కొన్నారు. వారు అందించే వినతులు, పోలీసు కేసుల విషయంలో చొరవ చూపాలని, పరిపాలనాపరమైన, న్యాయపరమైన సేవలను స్నేహపూర్వక వాతావరణంలో అందించాలని సూచించారు. క్లిష్టమైన పరిస్థితుల్లో భరణం వచ్చేలా, స్వయం ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా బాధిత మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని, మనోధైర్యం కల్పించాలని సూచించారు.