బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై మహిళా వ్యవసాయకూలి అక్కడికక్కడే మృతి చెందింది.గ్రామస్థుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఆదిమూల్లగెల్లపద్మ ,ఆదిముల్లమహేందర్ ప్రత్తి చేనులో కలుపు పనులు చేసేందుకుమరో ఇద్దరు మహిళా వ్యవసాయ కూలీలతో కలిసి ప్రత్తి పంటలో కలుపు తీస్తున్నారు ఇంతలోనే ఉరుములుమెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.ఇదే క్రమంలో భారీ శబ్దంతో పిడుగు వేసింది.ఈ సంఘటన లో గెల్లుపద్మ అనే వ్యవసాయ మహిళా కూలి అక్కడి కక్కడే మృతి చెందింది పిడుగు దాటికి మిగతా వ్యవసాయ మహిళా కూలీలు పరుగులు తీశారు ఈఘటనలో గ్రామానికి ఆదిముల్ల పావని స్వల్పంగా అస్వస్థత కు గురయ్యారు