కొయ్యాల గూడెం పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్. రికార్డ్స్ పరిశీలన. స్టేషన్, పరిసరాలను సందర్శించి పోలీసుస్టేషన్ నిర్వహణ మరియు రికార్డుల నిర్వహణపై లోతుగా పరిశీలించారు.రిసెప్సన్ సెంటర్, లాకప్ గదులను పరిశీలించి పోలీసు స్టేషన్లకు వచ్చే పిటీషనర్ల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు స్టేషన్ విధుల్లో పోలీసులు మెయింటేన్ చేసే ప్రతీ రికార్డును సమీక్షించారు.