బహిరంగంగా మద్యం, గంజాయి సేవించడం, వినియోగం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టేందుకు, నేరాల కట్టడికి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ గురువారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో బహిరంగ ప్రదేశాలు, గోదావరి నది పరివాహక ప్రాంతాలు, పాడుపడిపోయిన ఇల్లు, తోటల పై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట,ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ నేరాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.