ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లిలో గణేశ్ మండపం ఏర్పాటు విషయంలో ఉద్రిక్తత నెలకొంది. కాలనీలో ఎప్పటిలాగే విగ్రహాన్ని పెట్టగా దీనిపై కొందరు అభ్యంతరం తెలిపారు. దీంతో గ్రామంలో వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజలను శాంతింపజేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు