రానున్న 48 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. పట్టణాలు, గ్రామాలు, తండాలలో ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని, ఎక్కడ కూడా ఏ చిన్న అవాంచనీయ సంఘటన చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి సిపి సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ గురువారం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితులను సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.