కామారెడ్డి : పారి వర్షాలతో నీటిమయమై ఇబ్బందుల్లో వున్నా కామారెడ్డి జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కౌండిన్య కాలనీ వాసులపై కామారెడ్డి ఎమ్మెల్యే మాట సరికాదని, ఎమ్మెల్యే రమణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కామారెడ్డి CPM జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేసారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే తీరు ఒడ్డు దాటే దాకా ఓడ మల్లన్న ఒడ్డు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ఉందన్నారు. నిన్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలను ప్రజల తమ అవసరాలు బాధలు గాధలు తీరనప్పుడు ప్రజా ప్రతినిధులను ప్రభుత్వాలను నిలదీసే హక్కు విమర్శించే హక్కు నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందన్నారు.