అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల సమయంలో వైద్య సిబ్బంది డాక్టర్లు కదిరిలో వైద్య సిబ్బందిపై దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శివకృష్ణ ఏపీఎన్జీవో నగర కార్యదర్శి శ్రీధర్ బాబు మాట్లాడుతూ నిన్నటి రోజున కదిరి ఏరియా ఆసుపత్రిలో గుర్తి తెలియని వ్యక్తులు విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగిందని అదేవిధంగా వైద్య పరికరాలను కూడా ధ్వంసం చేయడం జరిగిందని ఇటువంటి సంఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డాక్టర్ శివకృష్ణ శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .