జడ్చర్ల ఫ్లైఓవర్ పై గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్కార్పియో, కంటైనర్ ఢీ కొన్నాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన జడ్చర్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కబెట్టారు.