మచిలీపట్నంకు మణిహారంలా నిలిచే మంగినపూడి బీచ్ ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అర్బన్ ఇన్ ఫ్రాస్టెక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిథి కిరణ్ తో కలిసి మంగినపూడి బీచ్ ను బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన సందర్శించారు. వసతులు, రక్షణ చర్యల గురించి పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు.