కాసిపేట మండలం కొండాపూర్ చౌరాస్తా యాప వద్ద గత రెండు సంవత్సరాలుగా రోడ్డు కుంగిపోయి ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని మాదిగ హక్కుల దండోరా మండల అధ్యక్షుడు అతకాపురం రమేష్ అన్నారు ఈ మేరకు రోడ్డుకు మరమ్మతులు చేపించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు దేవపూర్ లో జరిగిన ఎలక్షన్ పై ఉన్న శ్రద్ధ అదే దారిలో ఉన్న రోడ్డుపై చూపెట్టకపోవడం దారుణం అన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపించాలని డిమాండ్ చేశారు