నాడు తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన విద్యుత్ బారాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో విద్యుత్తు ఉద్యమం సాగిందని ఆ ఉద్యమంపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం అన్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు భీమవరంలో స్థానిక ప్రకాశం చౌక్ లో వామపక్షాల ఆధ్వర్యంలో నాటి అమరవీరులను స్మరించుకుంటూ కార్యక్రమం నిర్వహించారు. పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, అదానీ ఒప్పందాలను రద్దు చేయాలని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు.