ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగ యువతీ యువకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద నిరుద్యోగ యువత నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిరుద్యోగులు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువకులు మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమై నిరుద్యోగుల అమూల్యమైన సమయాన్ని వృధా చేసిందన్నారు.