ఆడపిల్లల రక్షణ కోసమే ప్రభుత్వం ఫోక్సో చట్టాన్ని అమలు చేస్తుందని చుండూరు సెక్టార్ ఐసిడిఎస్ సూపర్వైజర్ శకుంతల అన్నారు. గురువారం ఎడ్లపల్లి హైస్కూల్లో మిషన్ శక్తి సంకల్ప కార్యక్రమంలో భాగంగా ఫోక్సో చట్టం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశంలో సూపర్వైజర్ మాట్లాడుతూ చట్టం 2012 అనేది 18 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక వేధింపులు, దుర్వినియోగం మరియు లైంగిక నేరాలను నివారించటానికి ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక చట్టం అని తెలిపారు.