రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని ముస్తాబాద్ మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు శుక్రవారం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. జీపీ కార్మికులు మాట్లాడుతూ..తాము ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. నెలవారి జీతం ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కార్మికులను పర్మినెంట్ చేయాలని,రూ.10 లక్షల బీమా, హెల్త్ కార్డులు అందించాలన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామపంచాయతీ కార్మికులను ఆదుకోవాలని కోరారు