కనిగిరి పట్టణంలోని 11వ వార్డు దేవాంగ నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న అర్బన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అర్బన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను నాణ్యతగా చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను మున్సిపల్ చైర్మన్ ఆదేశించారు. రూ.1.40 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం అర్బన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు చేపడుతుందన్నారు. ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, నిర్మాణ పనులు పూర్తికాగానే ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.