ఆస్తి తగాదాల విషయంలో వరుసకుతమ్ముని భార్య పిల్లలను చితకబాదిన ఘటన కనిపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కనిపర్తి గ్రామంలో తాతల వారసత్వం నుండి వస్తున్న ఆస్తి తగాదాల విషయం లో వడ్లకొండ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వరుసకు తమ్మడి బార్య వడ్లకొండ విజయ మరియు కూతురు స్రవంతి లపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరి చారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. ఎంజీఎంలో వారు చికిత్స పొందుతున్న పరిస్థితి. పోలీసులు దాడి చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు మరియు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.