రాష్ట్రంలోని సంచార జాతులకు విద్య, ఉద్యోగ, రాజకీయాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని సంచార జాతుల మహిళా సంఘం కార్యాలయంలో ఆదివారం సంచార విముక్త, అర్ధ సంచార విముక్తి దినోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ సంచార జాతులను బ్రిటిష్ ప్రభుత్వం 1871 సంవత్సరంలో దాదాపు 250 జాతులను నేరస్థజాతులుగా ప్రకటించి నిర్బంధించి సంచార జాతులను తీవ్రంగా అణిచివేసి, వారి అస్తిత్వాన్ని అభివృద్ధిని జీవన ప్రమాణాలను పూర్తిగా దెబ్బతీసిందన్నారు.