గణేష్ నవరాత్రుల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్టమైన ఏర్పాట్లను చేయడం జరుగుతుందని SP రోహిత్ రాజు తెలిపారు.ఈ సందర్బంగా గోదావరి నది కరకట్ట వద్ద జరుగుతున్న నిమజ్జనోత్సవ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు.అక్కడ ఉన్న అధికారులకు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా SP మాట్లాడుతూ గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో పరిసర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.