జర్నలిస్టుల అక్రిడిటిటేషన్ కార్డులకు ప్రభుత్వం మరో మూడు నెలలు గడువు పొడిగించడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ శనివారం మధ్యాహ్నం పాడేరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలిపారు. ఈనెల 31వ తేదీతో ముగుస్తున్న గడువును నవంబర్ నెల 30వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఈమేరకు మీడియా యాజమాన్యాలు, జిల్లాలో అక్రిడిటిటేషన్ సౌకర్యం ఉన్న జర్నలిస్టుల జాబితాను పాడేరు జిల్లా పౌర సంబంధాల కార్యాలయంలో అందించాలన్నారు. పొడిగింపు స్టిక్కర్లను పొందాలని సూచించారు.