యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో అవినీతి కి పాల్పడుతున్న వార్డెన్ రాజోలు బాయ్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల శాంతి కుమార్ శనివారం డిమాండ్ చేశారు. శనివారం ఆయన వసతి గృహాన్ని సంఘ నాయకులతో కలిసి సందర్శించారు .వసతి గృహంలో గతంలో ప్రింటర్ కంప్యూటర్ పోయిందన్న అవినీతికి పాల్పడుతున్న వార్డెన్ పై చర్యలు చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని గతంలో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసినట్లు గుర్తు చేశారు.